ఈవో సూర్యకుమారిపై వేటు.. కొత్త ఈవో నియామకం...

 

బెజవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారంలో పెద్ద దుమారమే రేగింది. ఇక ఈ వ్యవహారంపై ప్రభుత్వం... ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగానే... దుర్గగుడి ఈవోగా ఉన్న సూర్యకుమారిపై వేటు పడింది. ఈఓగా పనిచేస్తున్న సూర్యకుమారి ని ఆ పదవి నుంచి తప్పించి.. ఆస్థానంలో.. సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ను దుర్గగుడి ఈవోగా ప్రభుత్వం నియమించింది. ఆయనను తక్షణం రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.