ఆయనకి కూడా ఆ పిచ్చి మొదలైందా..

 

అక్రమాస్తుల కేసులో వాళ్లు  A1, A2 నిందితులు..ఒకళ్లేమే లేచినదగ్గర నుండి కాబోయే సీఎం నేనే.. కాబోయే సీఎం నేనే అంటూ పగటి కలలు కంటుంటే.. మరొకరు మాత్రం నేనే కాబోయే కేంద్ర మంత్రి అంటూ చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ఇంతకీ వాళ్లేవరో తెలిసే ఉండి ఉంటుంది. ఎవరో కాదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇంకోకరు ఆయనకు కుడిభజంగా ఉండే విజయసాయిరెడ్డి.

 

ఇప్పటికే జగన్ ఎక్కడ బహిరంగ సభలు జరిగినా.. నెక్స్ట్ నేనే సీఎం అంటూ.. ఎక్కడ ఏ బహిరంగ సభలు జరిగినా ఊదరగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. అంతేనా ప్రజలు ఏ చిన్నసమస్య చెబుతున్నా దానికి నన్ను సీఎం చేయండి అప్పుడు మీ సమస్యలు తీరుస్తా అని చెబుతండటంతో మొదట ప్రజలు షాక్ తిన్నా.. ఆ తరువాత జగన్ పదే పదే ఈ మాటే అంటుంటే విసుగుచెందారు. ఇప్పుడు జగన్ సీఎం అవుతాడో లేదో తెలియదు కానీ... ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా పగలి కలలు కనడం మొదలుపెట్టారు. వైసీపీ ఎంపీ గా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో కొందరి పని పడతానని విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ,టీడీపీ మధ్య దూరం పెంచడానికి తాను చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని , త్వరలో చంద్రబాబు కమలనాథులకు గుడ్ బై కొట్టడం ,తాము కేంద్ర మంత్రివర్గంలో చేరడం లాంఛనం అని  తన సన్నిహితుల దగ్గర పదేపదే చెబుతున్నారట.

 

దీంతో విజయసాయి చేస్తున్న కామెంట్స్ తో ఆయన సన్నిహితులే ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే విజయసాయి రెడ్డి టార్గెట్ చేస్తుంది  టీడీపీ నాయకులను కాదు. ప్రభుత్వ అధికారులను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఈ మాటలు విన్న అధికారులు నవ్వుకుంటున్నారట. ఓ ఐఏఎస్ అధికారి అయితే  ఇంకో అడుగు ముందుకేసి  A 1 సీఎం , A 2 సెంట్రల్ మినిస్టర్ అయితే ఇక్కడ మేము ఉద్యోగాలు చేయములే అని అన్నారట. మరి దీనిపై విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఏది ఏమైనా పాపం జగన్ ఒక్కడే అనుకున్నారు.. కానీ ఇలా పగటి కలలు కనే నాయకులు జగన్ పక్కన చాలా మంది ఉన్నారన్నమాట...