మాల్యా కేసు ట్విస్ట్... భారత్ బ్యాంకులదే తప్పు...

 

బ్యాంకులకు వేల కోట్లు రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఇక మాల్యాను భారత్ కు రప్పించడానికి భారత్ చాలానే కష్టపడుతోంది. ఇక గత కొద్దిరోజులుగా లండన్ కోర్టులో ఈకేసు విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈకేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు విచారణలో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్ లోని వెస్ట్ మిన్ స్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతుండగా... ఈకేసును పరిశీలిస్తున్న న్యాయమూర్తి.. అసలు మల్యాకు రుణాలు ఇచ్చేందుకు భారత్ బ్యాంకులే నిబంధనలు ఉల్లంఘించాయని.. ఇప్పుడిప్పుడే తనకు ఆ కేసు అర్థమవుతోందని.. ముందు  భారతీయ బ్యాంకులు దీని పట్ల వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సంచలన విషయాలు బయటపెట్టారు. అంతేకాదు మాల్యాపై కుట్ర జరుగుతుందన్న కోణం కూడా అందులో ఉన్నట్లు తెలిపారు. మరి దీనికి భారతీయ బ్యాంకులు ఏం వివరణ ఇస్తారో చూడాలి.