రాయిదాడి జగన్నాటకమే.. బోండా ఉమాను ఇరికించేయత్నం?!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే జగన్ పై గులకరాయి దాడిని హత్యాయత్నంగా చిత్రీకరించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి.  చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోనే జ‌గ‌న్ పై రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింద‌ని, జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి తెలుగుదేశం ఓర్వ‌లేక పోతుంద‌ని వైసీపీ నేత‌లు విస్తృత ప్ర‌చారం చేశారు.  అంతేకాదు.. రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగిన క్ష‌ణాల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు,  తెలుగుదేశం నేత‌ల‌పై విష‌ప్ర‌చారం జ‌రిగింది.  వైసీపీ నేత‌లు   మైకుల ముందుకొచ్చి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే, పోలీసుల ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌స్తున్న విష‌యాల‌నుబ‌ట్టి  రాయిదాడి ఘ‌ట‌న‌కు తెలుగుదేశంకు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. జనం కూడా జగన్ పై రాయిదాడి సంఘటనలో తెలుగుదేశం ప్రమేయం ఉందని ఇసుమంతైనా నమ్మడం లేదు. సరే జనం నమ్మకపోతే పోనీ..  ఈ కేసును ఎలాగైనా టీడీపీ నేత‌ల‌పై నెట్టేసి వారిని అదుపులోనికి తీసుకుంటే తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో దూకుడునైనా ఆపవచ్చన్న తలంపుతో జ‌గ‌న్ మోహన్ రెడ్డి సూచ‌న‌ల‌తో పోలీసులు ఈ కేసులో తెలుగుదేశంను ఇరికించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలుగుదేశం విజ‌య‌వాడ‌ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి బోండా ఉమాపై రాయిదాడి కేసును బలవంతంగా రుద్దే దిశగా పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతున్నద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  జ‌గ‌న్‌పై రాయిదాడి కేసులో మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 16) తెల్ల‌వారు జామున వ‌డ్డెర కాల‌నీకి చెందిన ఎనిమిది మంది మైన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించి విచారిస్తున్నారు. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన ప్రాంతానికి వ‌డ్డెర ప్రాంతానికి కేవ‌లం 400 మీట‌ర్ల దూరమే ఉంటుంది. అయితే, త‌మ పిల్ల‌ల‌ను రెండు గంట‌ల్లో వ‌దిలిపెడ‌తామ‌ని తీసుకెళ్లార‌ని, పోలీస్ స్టేష‌న్ కు వెళ్లినా వారి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని కాల‌నీ వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ బ‌స్సుయాత్ర స‌మ‌యంలో రోడ్డుప‌క్క‌న నిల‌బ‌డితే రూ. 200 నుంచి 300 ఇస్తామ‌ని చెబితే వెళ్లామ‌ని, రూ. 200కు ఆశ‌ప‌డి వెళ్తే మా పిల్ల‌ల‌పై కేసులు పెట్టారంటూ వ‌డ్డెర కాల‌నీ వాసులు పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేసు ద‌ర్యాప్తులో 10మంది వ‌ర‌కూ న‌గ‌రంలోని వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల్ని ప్ర‌శ్నించిన పోలీసులు అందులో స‌తీష్ అనే యువ‌కుడిని రాయి విసిరిన వ్య‌క్తిగా గుర్తించారు. ఆ త‌రువాత బుధ‌వారం బోండా ఉమ కార్యాల‌యంలో ప‌నిచేసే వేముల ద‌ర్గారావు అనే మ‌రో యువ‌కుడిని తీసుకెళ్లారు. అత‌ని నుంచి కీల‌క స‌మాచారం రాబ‌ట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాయిదాడి కేసును ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై నెట్ట‌కుంటే ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న వైసీపీ పెద్ద‌లు  ఎలాగైనా తెలుగుదేశంకి ఈ కేసును అంట‌గ‌ట్టాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే  తెలుగుదేశం నేత బోండా ఉమ‌ను ఈ కేసులో ఇరికించి రాయిదాడి ఘ‌ట‌న‌ను తెలుగుదేశంపై నెట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌వ‌చ్చున‌న్నది జ‌గ‌న్ ప్లాన్‌గా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  వైసీపీ కుట్ర‌ల‌ను గుర్తించిన టీడీపీ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ విష‌యంపై బోండా ఉమ స్పందిస్తూ..  సీఎం జ‌గ‌న్ పై రాయి దాడి ఘ‌ట‌న‌కు తనకు ఎలాంటి సంబంధం లేక‌పోయినా కొంద‌రు పోలీసు అధికారులు త‌న‌ను ఇరికించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఇందులో భాగంగానే త‌న ఆఫీసులో ప‌నిచేసే దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు  రాయిదాడి ఘ‌ట‌న‌లో తాజాగా ప‌రిణామాల‌పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు స్పందించారు. రాయిదాడి కేసులో నిందితులంటూ వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల‌ను తీసుకుపోయారు. టీడీపీ నేత‌ల ప్రోద్భ‌లంతోనే దాడి జ‌రిగింద‌ని చెప్పించ‌డానికి య‌త్నిస్తున్నారంటూ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసు శాఖ‌తో ప్ర‌భుత్వం త‌ప్పులు చేయిస్తోంది. బోడా ఉమా ఎన్నికల ప్ర‌చారాన్ని త‌ప్పుడు కేసుల‌తో అడ్డుకోవాల‌ని య‌త్నిస్తున్నారు. అలా జ‌రిగితే సంబంధిత అధికారుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక శిక్షిస్తామంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. సీఎంకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన వారిని ఈ కేసు విచార‌ణ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించి,  ఈసీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  వేరే అధికారుల‌తో స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాయి దాడి కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే  ఇదేమంత సంక్లిష్టమైన కేసు కాదు. కానీ, రాయి దాడి కేసులో తెలుగుదుశం నేతలను ఇరికించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై రాయిదాడి జరగకుండా భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోకుండా.. వారితోనే కేసు దర్యాప్తు చేయిస్తుండటాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు అంతేకాదు. మైనర్లకు విచారణ పేరుతో తీసుకెళ్లి వారి ద్వారా తెలుగుదేశం నేతలే రాయిదాడి చేయాలని సూచించారని చెప్పించడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.  ఐదేళ్ల జగన్ ప్రభుత్వంపై  ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం   ఇప్పటి వరకూ వెల్లడైన పలు సర్వేల   ఫలితాల్లో వెల్లడైంది. జగన్ ను  గద్దె దింపి సాగనంపడానికి ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని సర్వేలు తేల్చేశాయి.  జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడం కూడా ఆయన పాలన పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారని తెలియజేస్తున్నది.  దీంతో వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి ప్రజలను బలవంతంగా బస్సుయాత్రకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాలంటే సానుభూతి పొందేలా ఏదో ఒక ఘటనను క్రియేట్ చేసి అయినా ప్రయోజనం పొందాలని జగన్ అండ్ కో రచించిన ప్రణాలికలో భాగమే  జగన్ రాయిదాడి ఘటన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రమేయంతోనే జరిగినట్లుగా కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలి పోటు ఘటనలను ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన విధంగానే ఇప్పుడు రాయిదాడి కేసును ఉపయోగించుకుని గట్టెక్కాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు.   రాయిదాడి ఘటనను తెలుగుదేశం నేతలపై నెడితే ప్రజల్లో జగన్ పై సానుభూతి ఏర్పడుతుందన్నది వైసీపీ పెద్దల భావనగా పరిశీలకులు చెబుతున్నారు.  అందుకే  పక్కా ప్లాన్ ప్రకారం రాయిదాడి కేసును తెలుగుదేశం నేతలపైకి నెట్టేందుకు కసరత్తు జరుగుతోందని అంటున్నారు.   
Publish Date: Apr 18, 2024 9:57AM

పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.  ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.  పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ  అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది. కనీసం పవన్ కల్యాణ్ పేరు కూడా ఉచ్ఛరించకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ప్రస్తావిస్తూ పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని చూస్తునే ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల అంతటి వ్యతిరేకత ఎందుకు. సాధారణంగా రాజకీయ నాయకులు పాటించాల్సిన కనీస సంయమనాన్ని కూడా పాటించకుండా పవన్ పై వ్యక్తిగత దూషణలకు సైతం తెగపడేంత ద్వేషభావం ఎందుకు?  అన్న ప్రశ్నకు పదేళ్ల వెనక్కు ఒక్కసారి వెళ్లాల్సి ఉంటుంది. ఔను నిజమే.. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో తన పార్టీ ఓటమికి అధికారానికి దూరం కావడానికి పవన్ కల్యాణే కారణమని జగన్ విశ్వసిస్తున్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పుడు లేకపోయి ఉన్నట్లైతే అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ భావనగా ఆయనకు సన్నిహితంగా ఉండే వారు ఇప్పటికీ చెబుతున్నారు.  అయితే వాస్తవానికి విభజనతో అన్నిందాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టే అనుభవం, దార్శనికత ఉన్న వ్యక్తిగా ఏపీ జనం చంద్రబాబును విశ్వసించారు కనుకనే ఆయన విజయం సాధించారన్నది విశ్లేషకులు మాట. విశ్లేషకుల మాట ఎలా ఉన్నా కేవలం పవన్ కల్యాణ్ అప్పట్లో తన పార్టీని ఎన్నికల బరిలో దించకుండా చంద్రబాబుకు మద్దతు పలకడం వల్లనే వైసీపీ పరాజయం పాలైందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. 2019 ఎన్నికలలో పవన్ పోటీలోకి దిగారు. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ 2014 నాటి పొత్తులు పొడవడంతో ఓటమి తప్పదన్న భయంతోనే ఆయన పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దూషణలకు తెగబడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదనీ, ఎప్పడు పవన్ ప్రస్తావన వచ్చినా ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే సంబోధిస్తున్న సంగతి తెలిసిందే.   సాధారణంగా రాజకీయ నాయకులు తమ విమర్శలలో ప్రత్యర్ధుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా నియంత్రణ పాటిస్తారు. మర్యాద రేఖ దాటకుండానే విమర్శలు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అటువంటి నియంత్రణ అనేదే లేకుండా పవన్ కల్యాణ్ వివాహాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు.  అయితే ఇటీవల ఓ రెండు నెలల కిందట జనసేనాని తనకు  జగన్ నాలుగో భార్యా అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో వైసీపీ అధినేత కొంచం వెనక్కు తగ్గారు. ఈ రెండు నెలలుగా పవన్ కల్యాణ్ వివాహాలపై ఎటువంటి కామెంట్లూ చేయకుండా నియంత్రణ పాటించారు. అయితే మనమంతా సిద్ధంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మళ్లీ నియంత్రణ కోల్పోయి జగుప్పాకరమైన భాషలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిశీలకులు గోదావరి జిల్లా వేదికగా జగన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తమదైన విశ్లేషణలు చేస్తున్నారు.  గోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం, బీసీ సామాజిక వర్గాల మధ్య స్వతహాగా ఉండే వైరాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీలను దగ్గర చేసుకునే వ్యూహంతో జగన్  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు.  అయితే పవన్ పై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలు  జగన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వవని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉన్న జగన్ కు  ఇటు కాపుల మద్దతు, అటు బీసీల మద్దతూ కూడా ఉందనీ, ఆ కారణంగా జగన్ వ్యాఖ్యల కారణంగా వైసీపీకే నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date: Apr 18, 2024 9:29AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.   ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
Publish Date: Apr 18, 2024 9:21AM

చోటే బేటియా గుట్టల్లో నక్సలిజంపై సర్జికల్ స్ట్రైక్.... 

దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు.  ఛత్తీస్ గఢ్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఉంది. దీంతో వారిని లేకుండా చేయాలని రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే వారిని అంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారీ ఎన్ కౌంటర్. పోలీసులు అడవిలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను దాదాపు ఏరిపారేశారు. ఎక్కడైనా ఆనవాళ్లు ఉంటే వారిని కూడా తుదముట్టిస్తున్నారు. ఇంకా పోలీసులు అడవిని గాలిస్తున్నారు. నక్సల్స్ ఆచూకీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదే.  పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో  జ‌రిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు.  ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్ట్రైక్ గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు. గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్‌-కస్నాసుర్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్‌ బలగాలు చంపేశాయి. తాజాగా నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతిచెందారు.  ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో డివిజన్‌ కమిటీ సభ్యులు నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒకరు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్‌రావు అలియాస్‌ మురళి అలియాస్‌ శ్రీపల్లి సుధాకర్‌ కాగా.. మరొకరు బీజాపూర్‌ జిల్లా భామర్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన లలితగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భూస్వా ముల బారి నుంచి గిరిజనులు, వ్యవసాయ కూలీలను రక్షించడానికి వామపక్ష తీవ్రవాదులు సాయుధ పోరాటా న్ని ప్రారంభించారు. దానికే నక్సలిజం అనే పేరు వచ్చిం ది. తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా పేరు మారింది. భూస్వాములను అంతమొందిస్తే వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు విముక్తి లభిస్తుందన్నది మావో యిస్టుల వాదన. అయితే, వ్యవస్థలో లోపాలను సరిదిద్ద కుండా వ్యక్తులను అంతమొందించడం వల్ల ప్రయోజనం ఏమిటని మేధావుల ప్రశ్న. మావోయిజం (నక్సలి జం) వ్యాప్తి పెరిగిన కొద్దీ, భూస్వాముల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పోతున్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికి వేలమంది పోలీసులు బలి అయ్యారు. ఈ ఉద్యమం పేరు చెప్పి, అటు మావోయిస్టుల్లోను, ఇటు పోలీసుల్లోనూ ప్రాణాలు కోల్పోతోంది బలహీనవర్గాల వారే. పోలీసు శాఖలో రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ మంది బలహీనవర్గాల వారే చేరుతున్నారు. మావోయి స్టుల కాల్పుల్లో సమిధలు అవుతున్నదీ వారే. అలాగే, నక్సలైట్‌ ఉద్యమంలో చేరిన వారిలో అధికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నదీ ఎక్కువగా వారే.
Publish Date: Apr 17, 2024 6:35PM

ఇంకా నెల రోజులు భరించాలా? జగన్ సర్కార్ పై జనంలో ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఏడాదికి ముందే ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు జనం హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటైనా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగకపోతాయా అని ఆశపడ్డారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఓటమి భయమో, మరో కారణమో జగన్  ముందస్తుపై ముచ్చట పడలేదు. ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది. 2019లో జగన్ కు రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం అప్పగిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు గడువు ముగింపునకు వచ్చింది. 2014 ఎన్నికలలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటుంటే కంటుండొచ్చు కానీ జనం మాత్రం ఆయన అధికార అహంకారాన్ని భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెబుతున్నారు. ఆయన సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. దీంతో ఓటమి ఖాయం అన్న నిర్ధారణకు వచ్చేసిన జగన్ తెగించేశారు. ఎటూ తప్పని ఓటమిని తప్పించుకునేందుకు ఉన్న మార్గాల అన్వేషణలో పడ్డారు.  ఆ అన్వేషణలో భాగంగానే హత్యాయత్నం అంటే సెంటిమెంటాయుధాన్ని ప్రయోగించారు. అయితే జనం మనస్సుల్లో కోడికత్తి డ్రామా సజీవంగా ఉండటంతో.. కోడికత్తి 2 అదే గులకరాయి దాడితో హత్యాయత్నం డ్రామా రక్తికట్టడం మాట అటుంచి నవ్వుల పాలైంది. జగన్ ను నవ్వుల పాలు చేసింది. సొమ్ముల కోసమే జనం జగన్ సభలకు వస్తున్నారని పోలీసుల విచారణ సాక్షిగా తేలిపోయింది.   దీంతో జగన్ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఇంకేం  చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. 
Publish Date: Apr 17, 2024 2:55PM

రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ 

ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.  దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
Publish Date: Apr 17, 2024 2:52PM