మరోసారి జగన్ ను ఆడుకున్నాడుగా..

 

కమెడియన్ వేణు మాధవ్ జగన్ ను తన కామెడీ డైలాగ్స్ తో ఆడుకుంటున్నారుగా. ఇప్పటికే నంద్యాల ఉపఎన్నికల ప్రచారమప్పుడు.. జగన్ పై వేణు మాధవ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.  ఒకడంటాడు.. బుద్ది లేనోడు తనకు చానల్ లేదు, పేపర్ లేదని, మరి చానల్ లేనోడికి.. పేపర్ ఎక్కడిదిరా బట్టేబాజ్ అంటూ తీవ్ర పదజాలంతో తిట్టాడు. అంతేకాదు..“నిజానికి తాను ప్రచారానికి రాలేదని, కేవలం మెజార్టీ ఎంతోస్తుందో తెలుసుకోవాలని మాత్రమే వచ్చానని, టిడిపి తరపున కూడా జగన్ మోహన్ రెడ్డే బాగా ప్రచారం చేస్తున్నారని, ఆయన ఇలాగే ప్రచారం చేస్తే మెజార్టీ మరింత పెరగడం ఖాయమంటూ” వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వేణు మాధవ్ జగన్ పై కామెంట్లు విసిరాడు. ఈరోజు చంద్రబాబు ను వేణు మాధవ్ కలిశారు. ఆ తరువాత మీడియా సమావేశంలో పాల్గొన్న వేణు మాధవ్... ముఖ్యమంత్రి గారిపై బెంగ వచ్చి, ఉరకనే కలవడానికి వచ్చానని చెప్పాడు. అక్కడితో ఆగకుండా.. జగన్ పాదయాత్రపై స్పందిస్తూ… “ జగన్ చాలా కష్టపడుతున్నారు, ఆయన్ని చూస్తే జాలేస్తోంది, అయిదు రోజులు పాదయాత్ర చేయాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ రావాలి, అంత ఇబ్బంది పడుతున్నారు… వారి కష్టం ఎవరూ తీర్చలేనిది” అంటూ ఎటకారపు డైలాగ్స్ వేసారు.