దట్స్ ది బ్యూటీ అంటున్న వెంకయ్య....

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు "లైఫ్ టైమ్ అచీవ్ మెంట్" అవార్డు దక్కింది. ఈ అవార్డును టీ సుబ్బరామిరెడ్డి రోశయ్యకు అందించారు. ఇంకా ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలుగు భాష గొప్పదనాన్ని తనదైన శైలిలో వివరించారు. ఇంగ్లీషు నేర్చుకోవద్దని ఎవరూ చెప్పరని, అదే సమయంలో మాతృభాషను మరచిపోరాదని ఆయన కోరారు. అమ్మ అన్న పదం గుండె లోతుల్లోంచీ వస్తుందని, మమ్మీ, డాడీ అంటే ఆ మాటలు పెదవుల చివర నుంచే వస్తాయని ఆయన అన్నారు. ప్రధాని చెప్పినట్టుగా ఉత్తరాది వారు దక్షిణాధి భాషలను, దక్షిణాది వారు ఉత్తరాది భాషలను నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. "మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస... ఇవన్నీ మనం కాపాడుకోవాలి. మన భాషలో రమ్యత ఉంది. ఉత్తర తెలంగాణలో భాష ఓ రకంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో ఓ రకంగా ఉంటుంది. దట్స్ ది బ్యూటీ. యూనిటీ ఇన్ డైవర్శిటీ. తెలుగు పద్యాల్లోని లాలిత్యం ఎంత బాగుటుంది. దాన్ని కాపాడుకుందాం" అని అన్నారు.