టీడీపీలో మరో రోజా అవుతుందా ఏంటి..?

 

తనకు చంద్రబాబు అంటే ఎంతో ఇష్టమని.. ఆయన చేస్తున్న అభివృద్దిని చూసే టీడీపీలో చేరుతున్నాని వాణి విశ్వనాథ్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. అంతేనా తాను నగరి ఎమ్మెల్యే రోజా మీద పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని.. రోజాకి కౌంటర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని.. ఇన్ డైరెక్ట్ గా నగరి సీటు కావాలని చెప్పకనే చెబుతుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా వాణి విశ్వనాథ్ మరో రోజా అవ్వదు కదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే రోజక్క నోటి దూల గురించి అందరికీ తెలిసిందే. ఆ నోటి దూల వల్లే ఎంతో మందితో తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ నుండి సస్పెన్షన్ అయింది. ఇంకా చెప్పాలంటే భూమా అఖిల డ్రెస్సింగ్ పై కామెంట్లు చేసి నంద్యాల ఉపఎన్నికల్లో ఓటమికి కారణం కూడా రోజా నోటికొచ్చినట్టు మాట్లాడమే అని సొంత పార్టీ నేతలు సైతం తిట్టుకున్నారు. ఇక ఆతరువాత జగన్ వార్నింగ్ ఇవ్వడం.. కొన్నిరోజులు సైలెంట్ గా ఉండటం జరిగిందనుకోండి. అయితే ఇప్పుడు వాణి విశ్వనాథ్ ను చూస్తుంటే టీడీపీలో మరో రోజా అవుతుందేమో అనిపిస్తుంది. దీని కారణం ఆమె ఇంకా టీడీపీ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకముందే  ఎక్కువగా మాట్లాడుతుందేమో అని అనిపించమే.

 

ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో స్పందించి వర్మ కామెంట్లు చేసేలా చేసుకుంది. ఇక జగన్ పాదయాత్రపై కూడా స్పందించింది. ముందు టీడీపీ నేతలు కూడా జగన్ పాదయాత్రపై స్పందించారు.. కానీ ఆతరువాత సైలెంట్ అయిపోయారు. అనవసరంగా జగన్ ను విమర్శించి హైప్ చేయడం ఎందుకని. కానీ వాణి విశ్వనాథ్ మాత్రం తాజాగా జగన్ పాదయాత్రపై స్పందించి.. జగన్ పాపాలు పోవాలంటే చేయాల్సింది పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర అంటూ.. ఇలాంటి దొంగ పాదయాత్రలు ఎన్ని చేసినా ప్రజలు జగన్ ని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇంకా రోజాతో పోటీపై స్పందించిన ఆమె.. 'ఒక్క రోజా కాదు, పది మంది రోజాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా నాకుంది..' అని కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే మాట్లాడింది. ఇవన్నీ చూస్తే ఇంకా పార్టీలోకి రాకముందే ఇంత దూకుడుగా ఉండే వస్తే ఆమెను పట్టుకోవడం కష్టమేనేమో. పార్టీకి దూకుడు అవసరమే. కానీ మరీ ఎక్కువ పనికిరాదు. ఎక్కువ దూకుడు ఉంటే ఎలా ఉంటుందో దాని ఫలితం రోజా అనుభవిస్తూనే ఉంది. సొంత పార్టీ నేతలే ఆమెపై కోపంగా ఉండే పరిస్థితి వచ్చింది. పార్టీకి పెద్ద తలనొప్పి రోజా అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు పార్టీలోకే ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.. అప్పుడే అంత దూకుడు పనికిరాదు. ఈమె దూకుడితో టీడీపీలో చేరి వారికి తలనొప్పిగా తయారై.. మరో రోజాలో అయితే మాత్రం రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఉండటం కష్టమే.