కన్నుమూసిన మాజీ PM వాజ్‌పేయి

మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నాయకులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఈరోజు తుదిశ్వాస విడిచారు.. 93 సంవత్సరాల వాజ్‌పేయి గత కొద్దిరోజులుగా ఆరోగ్యం బాలేకపోవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.. అయితే గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు కన్నుమూశారు.. వాజ్‌పేయి మృతితో బీజేపీ శ్రేణులతో పాటు.. రాజకీయ నాయకులు, ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. 1924 డిసెంబర్ 25 న జన్మించిన వాజ్‌పేయి, భారత ప్రధానిగా మూడుసార్లు పనిచేసారు.. 1996 లో మొదటిసారి ప్రధానిగా ఎన్నికైన వాజ్‌పేయి కేవలం పదమూడు రోజులే పనిచేసారు.. తరువాత రెండోసారి 1998 లో ప్రధానిగా ఎన్నికైన ఆయన సుమారు 11 నెలలపాటు పనిచేసారు.. ఇక మూడోసారి 1999 నుండి 2004 వరకు ఐదు సంవత్సరాలు ప్రధానిగా పనిచేసారు.. కాంగ్రెస్యేతర ప్రధానిగా ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తిచేసిన మొదటివ్యక్తి వాజ్‌పేయి కావడం విశేషం.. పార్టీలకు అతీతంగా ప్రజలు గౌరవించే అతి తక్కువ మంది ప్రధానుల్లో వాజపేయి ఒకరు.. అందుకే ఆయన మృతిపట్ల అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.