యూపీలో బీజేపీకి ఓటమి తప్పదా?

 

యూపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ ఘన విజయం సాధించి అధికారం దక్కించుకుంది.. దీంతో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది.. ఇక బీఎస్పీ పరిస్థితి కూడా అంతే ఉంది.. ఒకప్పుడు యూపీలో బలమైన పార్టీలుగా ఉన్న సమాజ్ వాదీ, బీఎస్పీలు బీజేపీ దెబ్బకి విపక్షాలుగా మిగిలిపోయాయి.. ఇదే ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా మారడానికి పునాది వేసింది.. ఉపఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసాయి.. మరోవైపు వీటికి తోడుగా కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉంది.. ఇంకేముంది వీళ్ళ పొత్తుతో ఉపఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది.. అందుకే ఇదే పొత్తుతో 2019 ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలని చూస్తున్నాయంట ఇరు పార్టీలు.. తాజాగా ఈ విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.. 2019 లో కూడా బీఎస్పీతో పొత్తు ఉంటుందని, బీజేపీ గద్దె దించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు.. ఈ పొత్తు కొనసాగితే ఉపఎన్నికల్లో లాగా, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీకి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు...