కాసులిస్తే కరోనా ఉన్నా లేనట్లే.. కొన్ని హాస్పిటల్స్ నిర్వాకం

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో సామాన్య జనం బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు కొంత మందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ప్రజలు మరింత అయోమయానికి గురౌతున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు టెస్ట్ ల విషయంలో మీనమేషాలు లెక్క పెడుతున్నాయి . కొన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వాలు ప్రవేట్ ల్యాబ్ లు హాస్పిటల్స్ లో టెస్టులకు అనుమతిచ్చాయి. దీంతో అనుమానం ఉన్నవారు ల్యాబులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఐతే తాజాగా అక్కడ కూడా కొంత మంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

తాజాగా యూపీలోని ఒక ప్రయివేట్ హాపిటల్ లో అడిగినంత సొమ్ములిస్తే పాజిటివ్ వచ్చినా నెగటివ్ అని రిపోర్ట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రూ 2500 ఇస్తే కరోనా ఉన్నా నెగటివ్ గా రిపోర్ట్ ఇస్తామని ఆ హాస్పిటల్, ఉద్యోగులు బేరం ఆడుతున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ ఐంది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి బిల్డింగ్ కు సీల్ వేశారు. అయినా కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఒకపక్క వణికిపోతుంటే దీంట్లో కూడా ఇలా కాసులకు కక్కుర్తి పడేవాళ్లను చూస్తే ఏవగింపు కలుగుతోంది.