దొరికిన దావూద్ సోదరుడు..నెక్ట్స్ దావూద్ వంతే

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి దావూద్ ఇబ్రహీం కోసం భారత ఏజెన్సీలు చేయని ప్రయత్నం లేదు..దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీలోనే ఉన్నట్లు భారతప్రభుత్వం అడ్రస్‌తో సహా ఇచ్చినా సరే..పాక్ ప్రభుత్వం వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఠానేకు చెందిన ఒక వ్యాపారిని డబ్బు కోసం బెదిరించినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ముంబైలోని నాగ్‌పడ ప్రాంతంలో ఇక్బాల్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2003లో యూఏఈ నుంచి దేశ బహిష్కారానికి గురైన ఇక్బాల్..తన సోదరుడు దావూద్‌కు ముంబైలో ఉన్న రియల్‌ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.