ఈగలు వాలిన ఆహారం తిన్నారో అంతే సంగతి...

భయ పెడుతున్నామని మాత్రం అనుకోకండి... ఈగలువాలిన ఆహారం తీసుకున్నారో అంతే సంగతి... ఎక్కడి కైనా బయటికి వచ్చినప్పుడు సరైన ఆహారం తీసుకోవాడం ముఖ్యంగా పరిశుభ్రమైన ఆహారం దొరకదు. అటువంటప్పుడు అక్కడ దొరికిన ఆహారాన్నే తీసుకోక తప్పని పరస్థితి. ముఖ్యంగా ఎండాకాలంలో  పరిశుభ్రమైన మంచి నీళ్ళు దొరకవు. కొన్ని ఆహార పదార్ధాలు అక్కడ దొరికే నీటితోనే తయారు చేస్తారు. ముఖ్యంగా తీపి పదార్ధాలు, పాలపదార్ధాలు, టీ, కోఫీ, టిఫిన్ అమ్మెహోటళ్ళలో రోడ్డు పక్కన బండి మీద దుమ్ముపడుతూ మురికి కాల్వల పక్కన వండే ఆహారం పట్ల శ్రద్ధ చూపించండిలేదంటే  అనారోగ్యమే. గ్యాస్ట్రో ఎంత్ర్రాలజిస్ట్ లు అంటున్న ఆవిషయం ఏమిటో చూద్దాం పదండి...

మనం తినే ఆహార పదార్ధాలపైన ఈగలు వాలినప్పుడు ఏమౌతుందిలే అనుకుంటున్నారేమో... మనం తినే ఆహారాన్ని ఈగ ఉన్నది ఉన్నట్లుగా తినలేదు. అందుకని మొదటగా ఈ పదార్ధం మీద ఈగ కక్కు తుంది. తరువాత ఆకక్కును తన కాళ్ళతో కసాపిసా కాళ్ళతో ఆహరంలోకి కలిపేస్తుంది. అలా కలపటం వల్ల కక్కుతో ఆహార పదార్ధం ద్రవరూపంలోకి మారుతుంది. ఇలా తోక్కుతున్నఆహార పదార్ధంలోనే మనకు అపకారం కలిగించే సూక్ష్మ క్రిములు కూడా చొరబడతాయి. పల్చగా అయిన ఆ ఆహారాన్ని కక్కుతో సహా ఈగ మళ్ళీ లోపలికి పీల్చుకుంటుంది. అలా పీల్చుకున్న సమయంలోనే కొంత మలాన్ని కూడా  విసర్జిస్తుంది. అలా విసర్జింపబడ్డ మలం ఆహార పదార్ధం మీద మిగులుతుంది. ఆ ఆహారాని మనం ఆహా.. ఆహా.. అనుకుంటూ లొట్టాలేసుకుంటూ మనం తింటాం.                                                                                        
 ఇప్పుడు మనం ఏమేమి తిన్నాం ?
                                                           
 ఆహారాన్ని, దానితో పాటు ఈగ కక్కుని, ఈగ మలాన్ని, సూక్ష్మ క్రిములని, కాబట్టి  ఆహార పదార్ధాల విషయంలో మనం తీసుకోవాల్సిన  జాగ్రత్తలంటూ కొన్ని ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందామా...                                                                                                             
 1) ఆహార పదార్ధాల మీద మూతలు ఉంచాలి.                                                                                                                                     
 2) ఆహార పాత్రల పైన మూతలు ఉంచాలి.                                                                                                      
 3) మంచి నీళ్ళ పాత్రల మీద మూతలు ఉంచాలి.                                                                                                          
4) డస్ట్ బిన్ మీద మాత్రం మర్చిపోకుండ మూత ఉంచాలి.                                                                                
5) అసలు ఇంటి పరిసరాలలో ఈగలు లేకుండా చూసుకోవాలి.

అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆహారం తీసుకున్నారో ఫుడ్ ఇన్‌ఫెక్షన్ అవ్వడం, వాంతులు, విరేచనాలు లాంటి అనేక రకమైన వ్యాధులు మనకు తెలియకుండానే సోకుతాయి. ముఖ్యంగా కోసిన పళ్ళు, లేదా చెరుకురసం ఉన్న బండ్లు, లేదా గప్ చిప్ బండ్లు, స్వీట్  స్తల్ల్స్ , రోడ్డుపై తోపుడు బళ్ళు ఇలా ఒకటి ఏమిటి ఇక్కడ అక్కడ అన్నదే లేదు ఎక్కడైనా అపరిశుభ్ర ఆహారం ఉంటుంది. అందుకే ఈగవాలిన ఆహారం తీసుకుంటారో.. ఇంట్లో ఒండుకుంటారో ఒక్కసారి మన ఆరోగ్యం గురంచి మనమే ఆలోచించుకోవాలి. సో... పొరిగింటి కూరకి వెళ్తారా.. ఇంటికూరకే వస్తారా మీఇష్టం ఛాయస్ ఇస్ యువర్స్.