ఉమాభారతి సంచలన నిర్ణయం...

 

బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి ఉమాభారతి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. దీనికి కారణం ఆమె ఆరోగ్య సమస్యలే కారణం. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఎన్నికల్లో పోటీ చేయరాదని తాను నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటివరకు తాను రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేశానని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తన ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదని.. మోకాళ్లు, వెన్నునొప్పితో చాలా బాధపడుతున్నానని ఆమె తెలిపారు. కానీ, పార్టీకి మాత్రం తన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.