క్లాసులు పీకుతున్నా, వార్నింగ్ లు ఇస్తున్నా నో యూజ్...

 

మోడీ ఎంత చెప్పినా బీజేపీ నేతలు ఒకళ్ల తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బుక్కవుతూనే ఉన్నారు. ఒకరి తరువాత ఒకరు నోరు జారి మోడీకి తలనొప్పిగా తయారవుతున్నారు. నోరు జారిన మంత్రులను మోడీ పిలిపించుకొని క్లాసులు పీకుతున్నా, వార్నింగ్ లు ఇస్తున్నా బీజేపీ నేతల నోరు మాత్రం కంట్రోల్ లో ఉండటం లేదు. ఎవరు ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఏమేం మాట్లాడుతారో.. ఎక్కడ మాట తూలుతారో, ఏమేం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు మరో నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ నేత ఎవరో కాదు  కేంద్ర మంత్రి ఉమాభారతి. దళితులపై ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

 

మాములుగా బీజేపీపై హిందుత్వపార్టీ అని ముద్ర ఉంది. దళితులపై దాడులు కూడా బీజేపీ హయాంలోనే ఎక్కువ జరిగాయి. దీంతో దళితులకు కూడా బీజేపీపై వ్యతిరేకత ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు ఉమాభారతి దళితులను ఉద్దేశించి అనుతిచవ్యాఖ్యలు చేయడంతో..  ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
ఛత్తర్ పూర్ లో ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తాను శ్రీరామచంద్రుడిని కాదని, పక్కన కూర్చొని భోజనాలు చేసినంత మాత్రాన దళితులను శుద్ధి చేయలేనని ఆమె వ్యాఖ్యానించారు. శబరి ఇంటికి వెళ్లిన రాముడు... అక్కడున్న దళితులను శుద్ధి చేశాడని, తనకు అంత శక్తి లేదని అన్నారు. కానీ దళితులు తన ఇంటికి వస్తే, భోజనం పెడతానని చెప్పారు. అంతేకాదు.... తన ఇంట్లోని డైనింగ్ టేబుల్ మీద దళితులకు భోజనం పెడితే, తన వంటపాత్రలు శుద్ధి అవుతాయని.. ఢిల్లీలో ఉన్న తన మేనల్లుడి ఇంటికి వస్తే... ఆయన భార్య మీకు వంటకాలను వడ్డిస్తుందని, భోజనాల తర్వాత తన మేనల్లుడు మీ ప్లేట్లను తీసి, శుభ్రం చేస్తాడని తెలిపారు. ఈ ఘటన కాస్తా వివాదాస్పదం కావడంతో, ఆ తర్వాత ఆమె క్లారిటీ ఇచ్చారు. తికమ్ ఘర్ జిల్లాలోని పపోడాకు వెళ్లి విద్యాసాగర్ మహరాజ్ ను తాను కలవాల్సి ఉందని... దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉందని... అందుకే భోజనం చేయలేకపోయానని ఉమ తెలిపారు. భోజనం చేయనందుకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పుకొచ్చారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిన తరువాత ఎంత కవర్ చేసినా ఏం ఉపయోగం. మరి దీనిపై మోడీ ఏం సమాధానం చెబుతారో చూద్దాం...