వీడియోలో అడ్డంగా బుక్కైన రాజాసింగ్!!

 

పోలీసుల లాఠీచార్జ్‌ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకి గాయమైన సంగతి తెలిసిందే. అయితే తనను తానే గాయపరుచుకుని రాజాసింగ్ హైడ్రామాకు తెరదీశారని పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు.
 
హైదరాబాద్‌ పాతబస్తీలోని జుమ్మెరాత్ బజార్ లో.. అక్కడి స్థానికులంతా కలిసి స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతిభాయ్‌ విగ్రహ ఏర్పాటుకు యత్నించడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

రాజాసింగ్‌పై పోలీసుల దాడిని బీజేపీ ఖండించింది. ఓ ప్రజాప్రతినిధిని రక్తం వచ్చేలా కొట్టడం దారుణమని, తెలంగాణలో ప్రజాపాలన ఉందా? రజాకార్ల పాలన కొనసాగుతోందా? అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

అయితే ఇప్పుడు ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ వచ్చింది. అసలు రాజాసింగ్‌పై పోలీసులు దాడి చేశారనడంలో ఏమాత్రం నిజం లేదని.. రాజాసింగ్ తనను తాను గాయపరుచుకున్నారని రుజువు చేస్తూ పోలీసులు ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోలో రాజాసింగ్ తనని తనని రాయితో గాయపరచుకోవడం కనిపించింది. మరి దీనిపై రాజాసింగ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.