తెలంగాణ ఉద్యోగ పరీక్షల్లో ప్రశ్నలు ఏంటో తెలుసా...?

సాధారణంగా ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ పరీక్షల్లో ప్రశ్నలు ఏముంటాయి..హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే తెలంగాణలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ నిమిత్తం ఈ ఆదివారం టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన మలిదశకు సంబంధించి రెండు ప్రశ్నలు ఇచ్చారు. రెండు కళ్ల సిద్ధాంతం ఎవరిది..అంటూ ఓ ప్రశ్నను అడిగి..దీనికి ఆప్షన్లుగా వైఎస్ జగన్, బీవీ రాఘవులు, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు పేర్లను ఇచ్చారు. అలాగే లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు పెప్పర్ స్ప్రేతో దాడి చేసింది ఎవరు...? అడిగారు. దీనికి ఆప్షన్లుగా జగన్, లగడపాటి, ఎన్.శివప్రసాద్, సుజనా చౌదరిల పేర్లను ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్లు అని ఉద్యమ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు.. లోక్‌సభలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పేను ఉపయోగించడం అప్పట్లో సంచలనం కలిగించింది.