తెలంగాణలో లగడపాటి లెక్క తప్పినట్టేనా?

 

తెలంగాణలో ఓట్ల లెక్కింపు మొదలైంది. టీఆర్ఎస్ ఎవరి ఊహలకు అందకుండా దూసుకుపోతుంది. ప్రస్తుతం 85 + స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరి చివరివరకు టీఆర్ఎస్ ఈ ఆధిక్యాన్ని కొనసాగించి మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో చూడాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ పూర్తి మెజారిటీతో అధికారం ఏర్పాటు చేసేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే లగడపాటి లెక్క తప్పినట్టే. ఆంధ్ర ఆక్టోపస్ గా పిలవబడే లగడపాటి సర్వేలకు మంచి పేరుంది. ఆయన సర్వేలు దాదాపు నిజమవుతాయి. కానీ తెలంగాణలో ఆయన చెప్పింది తారుమారు అయ్యేలా కనిపిస్తోంది. పోలింగ్ రోజున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ కు అనుకూలంగా చెప్పగా, లగడపాటి మాత్రం ప్రజకూటమికి అనుకూలంగా చెప్పారు. దీంతో ప్రజకూటమి నేతలు తమదే గెలుపని నమ్మకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో లగడపాటి లెక్క తప్పినట్టే కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.