కాంగ్రెసులోకి టీఆర్ఎస్ ఎంపీ

 

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీలో బాంబు పేల్చారు.ఎన్నికల పోలింగ్‌కు ముందే ప్రధానమైన వ్యక్తులు, ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కాంగ్రెస్ లో చేరనున్నారని రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే పార్టీలో చేరేవాళ్లలో వినిపిస్తున్న మొట్టమొదటి పేరు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిది.ఆయనతోపాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.రేవంత్ రెడ్డి ప్రకటన వెలువడిన సమయంలో తాండూరులో విశ్వేశ్వర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాలుష్యంపై మాట్లాడారు.రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెసులో చేరే ఇద్దరు ఎంపీల్లో మీరు కూడా ఉన్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగారు.స్పందించిన విశ్వేశ్వర్‌రెడ్డి.. ‘ఇద్దరు కాదు ముగ్గురు’ అంటూ విలేకర్ల సమావేశం ముగించి వెళ్లిపోయారు. 

అనంతరం ఆయన అన్న వ్యాఖ్యలు నిజమేనా అని తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు సంప్రదించగా...తనపై రోజూ ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని, తనతో పాటు ఇద్దరుముగ్గురిపై కూడా ఇలానే ప్రచారం జరుగుతోందని.. ఆ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని’ చెప్పారు. గతంలో కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగిందని, అపుడు విలేకర్లు అడిగితే చేరుతున్నాననే చెప్పానని.. ఇప్పుడు కూడా అలాగే యథాలాపంగా చెప్పానని అన్నారు. అయితే ఆయన ఎలా చెప్పినప్పటికీ కొన్ని నెలలుగా టీఆర్ఎస్ కు దూరంగా ఉండడం, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

 

 

వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ముందుగానే టికెట్‌ హామీ ఇవ్వడంతో పాటు ఆయన వర్గీయులకు కూడా పార్టీలో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. సోనియా త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనతో పాటు మరికొందరు టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలిసింది.ఆయన చేసిన వ్యాఖ్యలతో కంగుతున్నటీఆర్ఎస్ పార్టీ ఆయనతో మంతనాలు జరిపే భాద్యతను కేటీఆర్‌, కవిత లకు అప్పగించినట్టు తెలుస్తోంది.అయితే ఆయన వీరిద్దరికి మాట్లాడేందుకు అందుబాటులోకి రాకపోవటం మరింత చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.