తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై కాల్పులు...

Publish Date:Jan 11, 2017

 

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఖరగ్‌పూర్‌ నగరంలో ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై కొంతమంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

By
en-us Politics News -