సిట్ చేతిలో డ్రగ్స్‌ కేసు జాతకాలు.. ఇద్దరు కన్ఫామ్..!

 

హైదరాబాద్ లో డగ్ర్స్ వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉండటంతో ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో సిట్ అధికారులు పదిమందిని విచారించారు కూడా. అయితే ఇప్పుడు ఈకేసులో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే... వీరిలో ఇద్దరిపై కన్ఫామ్ గా చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. విచారణ సమయంలో సినీ ప్రముఖుల రక్త నమూనాలు, తల వెంట్రుకలు, గోర్లను సేకరించిన ఫోరెన్సిక్ అధికారులు..వాటిని పరీక్షించారు. ఇప్పుడు వాటికి సంబంధించిన నివేదిక సిట్ అధికారుల చేతిలో ఉంది. విచారణ సమయంలో ఒకరిని డ్రగ్స్ సరఫరా దారుల జాబితాలో చేర్చగా.. ఓ హీరో మరికొందరికి డ్రగ్స్ ఇచ్చినట్టు పేర్కొంది. ఇప్పుడు వీరిద్దరూ స్వయంగా డ్రగ్స్ వాడినట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఇక విచారణ ఎదుర్కొన్న మరో నటుడు శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించగా, గతంలో ఆయన డ్రగ్స్ వాడినట్టు తెలుస్తున్నా, ప్రస్తుత కేసులో ఎటువంటి సాక్ష్యాలూ లేవని సిట్ అధికారులు వెల్లడించారు. అధికారుల నుంచి అనుమతి రాగానే రెండు రోజుల్లో చార్జ్ షీట్ ను వేస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి. మరి ఆ ఇద్దరూ ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.