టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై కేసీఆర్ సమీక్ష

గత కొద్ది  రోజులుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ స్కూళ్లతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనం సృష్టించడం..ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో ఆయన దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.