పేర్లు బయటొచ్చాయి! దిమ్మ తిరిగింది! మైండ్ బ్లాంకైంది!

 

మొదట డ్రగ్స్ రాకెట్ కలకలం. తరువాత స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసలవుతున్నారంటూ సంచలనం! ఆ తరువాత డ్రగ్స్ కు, టాలీవుడ్ కు లింక్! ఈ మాట చెప్పగానే మీడియా మొత్తం అదరిపోయింది. కొందరికి నోటీసులు కూడా వెళ్లాయనే సరికి మరింత అలెర్ట్ అయ్యాయి న్యూస్ ఛానల్స్. అయితే, నిన్నటి దాకా పోలీసులు టాలీవుడ్ డ్రగ్స్ బాబులు ఎవరో బయటపెట్టలేదు. కాని, వున్నట్టుండీ ఇవాళ్ల ఉదయం తెలుగు సినిమా పరిశ్రమలోని బడాబడా పేర్లు బయటకొచ్చాయి! మత్తు రాజాలు, మత్తు రాణీలు జనం ముందుకొచ్చేశారు! అయితే, అసలు ఇంతగా హంగామా ఎందుకు జరుగుతోంది? గతంలో ఎప్పుడూ లేని విధంగా పేర్లతో సహా వ్యవహారమంతా బయటకి పొక్కటం ఏమిటి?

 

పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజ… ఇలాంటి వారి పేర్లు కూడా మీడియాకి లీక్ కావటం ఎవ్వరూ ఊహించనిదే! నిన్నటి దాకా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది మీడియా. కాని, ఇవాళ్ల నేరుగా పేర్లు చెప్పేయటం వెనుక పోలీసుల లీకులే వున్నాయి. వారు ఈ సెలబ్రిటీలకు ఖచ్చితంగా నోటీసులు పంపామని చెప్పకుండా ఏ ఛానల్ కూడా అగ్ర హీరో, మంచి పేరున్న హీరోయిన్, టాప్ డైరెక్టర్ … వీళ్ల పేర్లు జనానికి చెప్పేయదు! అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఎలా బయటకొచ్చాయని పోలీసులు బాస్ అకున్ సబర్వాల్ కూడా సీరియస్ అవుతున్నారట! ఆయనకు కూడా పేర్లు మీడియాకి లీక్ కావటం మరీ విడ్డూరం!

 

తరూణ్ నుంచీ తనీష్ దాకా చాలా మంది పేర్లు డ్రగ్స్ లిస్టులో చేరిపోయాయి. వాళ్లలో నిజంగా డ్రగ్స్ వాడిన వారు ఎందరో, డ్రగ్స్ బిజినెస్ లో కూడా వేలు పెట్టిన వారు ఎందరో మనకు తెలియదు. కాని, కొన్నవారు, అమ్మినవారు మొత్తం అందరూ ఇప్పుడు పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. బహుశా లీకుల వెనుక పోలీసుల వ్యూహం ఇదే అయి వుంటుంది. టాలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ పెంచి పోషిస్తున్న ప్రముఖులందర్నీ జనం ముందు బుక్ చేయటం వారి ఐడియా అయి వుండాలి. ఎందుకంటే, ఇప్పుడు నోటీసులు అందుకున్న వారందరికీ కోర్టుల దాకా వ్యవహారం వెళ్లి శిక్షలు పడే అవకాశం లేదు. విచారణకు హాజరు కావాలని అధికారులు చెప్పారు కాబట్టి సినిమా వాళ్లు వస్తారు. హాజరవుతారు. వారికి వార్నింగ్ ఇచ్చామన్న పోలీసులు అక్కడితో కథని సుఖాంతం చేస్తారు. ఇంతకంటే ఎక్కువగా స్క్రీన్ ప్లే నడిచే అవకాశాలు దాదాపు లేవు!

 

టాలీవుడ్లో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా జరుగుతోందని ఇప్పుడే కాదు చాలా రోజులుగా చాలా మందికి తెలుసు. అయితే, ఇప్పుడు వాళ్లలో కొందరి పేర్లు బయటకు వచ్చాయి. అలాగని పేర్లు బయటకి రాని ఇంకా చాలా మంది మత్తు బాబులు బుద్దిమంతులు అనలేం. కేవలం కెల్విన్ అనే ఒక డ్రగ్ పెడ్లర్ పట్టుబడితేనే ఇంత డొంక కదిలింది. కాబట్టి సినిమా పరిశ్రమలో చీకటి తతంగాలు ఇంకా చాలానే వుండివుంటాయి. కాకపోతే, ఎవ్వరినైనా జైలు శిక్ష దాకా తీసుకెళ్లటం మన వ్యవస్థలో చాలా పెద్ద పని! సల్మాన్ పై వున్న తీవ్రమైన నేరారోపణలు, కేసుల సంగతి చూస్తే మనకు ఎంత సమయం పడుతుందో తెలిసిపోతుంది. అందుకే, మీడియాకి లీకులు ఇవ్వటం ద్వారా డ్రగ్స్ వాడిన సెలబ్స్ కి షాకిచ్చారని భావించవచ్చు. ఈ ఎసిపోడ్ తో ఇక మీదట చాలా మంది ప్రముఖులు జాగ్రత్తగా పడే అవకాశాలున్నాయి. డ్రగ్స్ కు దూరంగా వుండే అవకాశాలూ లేకపోలేదు!

 

కేవలం మన టాలీవుడ్ ను మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న సినిమా రంగాల్ని గమనిస్తే మనకు ఒక్కటి అర్థమవుతుంది. చాలా మంది సినిమా సెలబ్రిటీలు, ఇతరుల గ్లామర్ ప్రపంచపు జీవులు డ్రగ్స్ కు బానిసలఅవుతూనే వుంటారు. అందుక్కారణం వారికుండే మానసిక ఒత్తిడి. అలాగే చుట్టూ వుండే మనసు బలహీన పరిచే లైఫ్ స్టైల్. వీటి వల్ల ఇతర రంగాల కంటే కొంచెం ఎక్కువే సినిమా వారు డ్రగ్స్ కు లొంగుతుంటారు. మోడలింగ్ రంగంలోని వారు కూడా ఇదే కోవకు వస్తారు. కాబట్టి టాలీవుడ్ డ్రగ్స్ కలకలం మరీ ఊహించరానిది చూడకూడదు! దాన్ని గ్లామర్ ప్రపంచపు సహజమైన సైడ్ ఎఫెక్ట్ గా స్వీకరించాలి!