9రోజులపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత..!!

తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమం సందర్బంగా ఆగస్టు 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేయనున్నారు.

 

 

మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 12 నుంచి 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు.. ఇందులో భాగంగా 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది.. ఆయా రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండడం.. భక్తులకు దర్శనం కల్పించేందుకు తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.. గతంలో తిరుమలకు రోజూ 20 నుంచి 30 వేల మంది భక్తులు వచ్చేవారని, దీంతో పరిమితంగానైనా దర్శనానికి అనుమతిచ్చేవారమని.. ప్రస్తుతం రోజూ తిరుమలకు వచ్చే వారి సంఖ్య లక్షకు పైగా చేరడంతో ఈ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈవో తెలిపారు.