13 ఏళ్ల పగ... కాల్చి చంపిన అక్కాచెల్లెళ్లు..

 

చిన్నప్పటి పగ దాదాపు 13 సంవత్సరాలు తరువాత నెరవేర్చుకున్నారు పాకిస్థాన్ కు చెందిన అక్కాచెల్లెళ్లు. ఓ వ్యక్తిని తుపాకులతో కాల్చి చంపేశారు. అసలు వారి పగ ఏంటో.. ఎందుకు చంపారో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 2004లో అంటే దాదాపు 13 ఏళ్ల క్రితం ఫాజల్‌ అబ్బాస్‌ (45) అనే వ్యక్తి దైవదూషణ చేశాడంట. అయితే అప్పుడు అతనిపై కేసు నమోదైంది. ఆ తరువాత పాకిస్థాన్‌ వీడి బెల్జియం వెళ్లాడు. ఇటీవలే ఆయన పాకిస్థాన్ తిరిగొచ్చాడు. అయితే ఈవిషయం తెలుసుకున్న అక్కాచెల్లెళ్లు అబ్బాస్‌ ఇంటికి వెళ్లి..  తాము అబ్బాస్‌ను కలవాలని ఆయన తండ్రితో చెప్పారు. ఇంట్లో నుంచి అబ్బాస్‌ బయటకు రాగానే బురఖాలో దాచిన తుపాకీలను తీసి కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సందర్బంగా వారు అప్పట్లో తాము చిన్నపిల్లలు కావడంతో అతన్ని చంపలేకపోయామని, ఇప్పుడు శిక్ష విధించామని చెప్పారు.