ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి..

 

ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. వివరాల ప్రకారం...జమ్ము-పఠాన్ కోట్ హైవేపై ఉన్న ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక హవాల్దార్, అతని కుమార్తె గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే సైనికులు ఆ ప్రాంతాన్నంతా అధీనంలోకి తీసుకున్నారు. క్యాంప్ లో ఆర్మీ క్వార్టర్సే కాకుండా స్కూళ్లు కూడా ఉండటంతో... స్కూళ్లన్నింటినీ మూసివేయాలని జిల్లా అధికారులు ఆదేశాలను జారీ చేశారు. క్యాంప్ వెనుక భాగం నుంచి ఉగ్రవాదులు చొరబడినట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఘటన నేపథ్యంలో క్యాంప్ ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భారీ ఎత్తున సైన్యం మోహరించింది. అయితే, ఎంతమంది టెర్రరిస్టులు చొరబడ్డారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు.