భక్తి యాత్ర చావుకు బాటగా మారనుందా?

 

అమరనాథ్ జమ్మూ & కశ్మీర్‌ లో ఉన్న చాలా పవిత్రమైన హిందూ తీర్థయాత్ర.అమరనాథ్ యాత్రని శ్రీ అమరనాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు ద్వారా జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది, ఈ పవిత్ర తీర్థయాత్రని ప్రతి సంవత్సరం లక్షల యాత్రికులు సందర్శిస్తారు.ఎక్కువగా భక్తులు కాలినడకన కొండలు ఎక్కుతూ అమరనాథ్ యాత్ర సాగిస్తారు.అమర్నాథ్ ఆలయం ఓ  గుహలో నెలకొంది.ప్రతి సంవత్సరం యాత్ర 35 రోజుల నుండి 60 రోజుల వరకు నిర్వహిస్తారు. గతేడాది జులై 10న అమర్‌నాథ్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై లష్కరే ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.తాజాగా అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడికి కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో కశ్మీర్‌ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.