టీఆర్ఎస్ గూటికి టీడీపీ నేత...!

 

ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి ప్రతిపక్ష పార్టీ నేతలు జంప్ అవడం చూస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరు. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి ప్రతిపక్ష పార్టీ నేతలు జంప్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నుండి పలువురు నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అవ్వగా... ఇప్పుడు తాజాగా మరో నేత టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాఠోడ్‌ రమేష్‌  టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినట్లు తెలిసింది. తెదేపాలో ఉన్న సమయంలో తుమ్మలతో దగ్గరి సంబంధాలుండడంతో ఆయన ద్వారా వెళ్లారు. వచ్చే నెలలో రాఠోడ్‌రమేష్‌ చిన్నకుమారుడి వివాహం ఉండడంతో ఆయన ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి శుభలేఖ అందజేశారు. ఇదే సందర్భంగా తెరాసలో చేరే విషయమై మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 29న రాఠోడ్‌ తన కుమారుడు రితీష్‌ రాఠోడ్‌, తన వర్గీయులతో కలిసి తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏంత నిజముందో తెలియాలంటే అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.