నిరుద్యోగుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తం

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారింది. ఓయూ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పినప్పటికి ఉదయం ఉస్మానియా విద్యార్థులు హాస్టల్స్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని లా కళాశాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు, కార్ల అద్దాలను పగులగొట్టారు. నగరంలోని కొన్ని ప్రాంతాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇందిరాపార్క్ వద్దకు వెళ్లే ధర్నాచౌక్ రహదారిని మూసివేశారు.