తెలంగాణ పంచాయితీ

 

తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా? అంటే అది గ్రామ పంచాయితీ ఎన్నికలే.. అసలు గ్రామ పంచాయితీ ఎన్నికలు ఉన్నాయా? లేవా? ఒకవేళ ఉంటే ఎప్పుడున్నాయి? అంటూ ఓటరు నుండి లీడర్ వరకు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు.. తెరాస ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇదే విషయం గురించి ఆలోచిస్తుంది.. సీఎం కేసీఆర్ ఏమో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటున్నారు.. కానీ తెరాస ఎమ్మెల్యేలు, నేతలు మాత్రం తొందర పడొద్దు ఇప్పుడు నిర్వహించటం కరెక్ట్ కాదు అంటున్నారట..

 

ఇదేంటి సీఎం సార్ అంత నమ్మకంగా నిర్వహించాలి అనుకుంటుంటే, ఎమ్మెల్యేలు ఎందుకు వద్దంటున్నారు అనుకుంటున్నారా?.. సీఎం నమ్మకం సీఎం ది.. ఎమ్మెల్యేల నమ్మకం ఎమ్మెల్యేలది..కేసీఆర్ ఏమో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బాగా పోయాయి.. సార్వత్రిక ఎన్నికలకి ఏడాది కూడా లేదు.. గ్రామ స్థాయిలో మన బలం తెలుస్తుంది.. దాన్ని బట్టి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చని చూస్తున్నారట.. కానీ ఎమ్మెల్యేలు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు..

 

గ్రామ స్థాయి రాజకీయాలు వేరేలా ఉంటాయి.. పొరపాటున ఫలితాలు ప్రతికూలంగా వస్తే.. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందనే సంకేతాలు వెళ్తాయి.. ఇది ప్రతిపక్షాలకు వరంగా మారుతుంది.. ఈ ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద కూడా పడుతుంది.. అందుకే పంచాయితీ ఎన్నికలు నిర్వహించకపోవడమే మంచిదని తెరాస ఎమ్మెల్యేలు భావిస్తున్నారట.. మరి కేసీఆర్ ఎమ్మెల్యేలు మాట విని వెనకడుగు వేస్తారో లేక తాను అనుకున్న మాట ప్రకారం ముందడుగు వేస్తారో చూడాలి.