మళ్లీ పిలవలేదుగా.. చంద్రబాబు అంటే చులకనా..?

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఎప్పటినుండో దీనిపై చర్చలు జరుగుతున్నాయి కనుక ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఈ మహా సభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక అయింది. స్టేడియాన్ని సర్వాంగ సుదరంగా సిద్దం చేసింది ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసింది. ఈరోజు సాయంత్రం ఈ తెలుగు పండుగ ఆరంభంకానుంది.  ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా రానున్నారు. ఆయన ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. ఇక మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డిలు వేదికపై ఆశీనులు అవుతారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యఅతిథులు పాల్గొంటారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు మహాసభలను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 19వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల ద్వారా తెలంగాణలో తెలుగు భాషావికాసం, సాహితీమూర్తుల ప్రతిభా విశేషాలను ప్రపంచానికి చాటనుంది.

అయితే ఇక్కడి  వరకూ బాగానే ఉంది. మరి ఈ తెలుగు మహా సభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారా అంటే.. లేదనే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రమై ఉంది.. పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వనం పంపకపోవడంపై.. పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి మాత్రమే కాదు.. ఒక మెట్రో ప్రారంభానికి గాని.. జీఈఎస్ సదస్సుకు కానీ చంద్రబాబు ను ఆహ్వానించలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆహ్వానించకపోగా.. మళ్లీ చంద్రబాబుకు జెలసీ అన్న రూమర్లు పుట్టించడం మళ్లీ. రాష్ట్రం విడిపోయిన తరువాత.. కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి... చంద్రబాబే స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి.. ఆయనకు కార్డు ఇచ్చి మరీ ఆహ్వానించారు. అది కూడా కేసీఆర్ కు గుర్తులేదమో మరి. రాష్ట్ర విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒకటే.. అన్నా దమ్ముళ్లు... అక్కా చెల్లళ్లలాగా కలిసిఉందాం అని చెప్పిన మాటలు ఏమయ్యాయో..

 

అసలు ఈ సభలను ఎందుకు నిర్వహిస్తున్నారు.. తెలుగు జాతి అంతా ఒక్కటే, తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తం అన్న సందేశాన్ని చాటి చెప్పాలని నిర్వహిస్తున్నారు. అలాంటిది.. ఎక్కడెక్కడో ఉన్న ప్రముఖులు అందరినీ పిలిచారు. వారిని సగౌరవంగా సత్కరించాలని చూస్తున్నారు కేసీఆర్. ఎక్కడో ఉన్నవాళ్లు గుర్తున్నారు కానీ... పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం.. అది కూడా ఓ తెలుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు మాత్రం కేసీఆర్ గారికి కనిపించలేదు. అసలు కనిపించలేదా..చంద్రబాబును మర్చిపోయారా? లేక కావాలనే విస్మరించారా? అన్నది ఇప్పుడు అందరి డౌట్. ఏది ఏమైనా.. కేసీఆర్ గారు ఈ విషయంలో మరోసారి ఆలోచించి ఉండే బావుండేదేమో అని పలువురు అనుకుంటున్నారు. తెలుగు మహా సభలు పెడుతూ.. తెలుగు రాష్ట్ర సీఎం ను ఆహ్వానించకపోవడం అనేది సముచితం కాదు అన్నది పలువురు అభిప్రాయం.. మరి ఎందుకు పిలవలేదన్నది తెలంగాణ సర్కారుకే తెలియాలి.