తెలంగాణలో జోరుగా సాగుతున్న మున్సిపల్ పోలింగ్...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్  కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మన్సిపాల్టీలు 9 కార్పొరేషన్ లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,961 పోలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 11,179 మంది కౌన్సిలర్ అభ్యర్ధులు 1747 మంది కార్పొరేటర్ అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1240  మంది ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.120 మున్సిపాలిటీలో 25,14600 పురుష ఓటర్లు, ఇరవై లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై రెండు మంది మహిళ ఓటర్లు ఉన్నారు.ఇక 9 కార్పొరేషన్ లలో 6,66,900 మంది పురుష ఓటర్లు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రెండు మంది మహిళ ఓటర్లు ఉన్నారు.

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ సమీపం లోని ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ స్టేషన్ వద్ద ఇరు పార్టీ లకు చెందిన కార్యకర్తలు తన్నుకొన్నారు. డబ్బులు పంచుతున్న వారిని మరో పార్టీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలకు నోట్లు పంచుతుండగా పట్టుకొని చితకబాదారు.పోలీసులు కూడా భారీ బందోబస్తులను కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్స్ ఉంటే లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించేస్తున్నారు పోలీసులు. ఒకరు ఓటేసిన తర్వాత ఒకరు ఓటేసేలా అవకాశమిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ ఉన్న వారికి పూర్తిగా ఆధార్ కార్డు అదే విధంగా ఓటరు కార్డు ఎందుకంటే ఇక్కడ మీర్పేట్ బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం కొంత మేర గొడవలయ్యాయి. దొంగ ఓట్లు నమోదు చేసినట్లు సమాచారం.పోలీసులు తక్షణమే అనుమానితుల్ని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆధార్ కార్డు ద్వారా  స్పష్టతవచ్చాకే అందరిని పోలింగ్ కేంద్రాలకు పోలీసులు అనుమతిస్తున్నారు.మొత్తం మీద పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి తప్పుడు చర్యలు జరగకుండా ఉండేలా తగిన చర్యలు చేపట్టారు అధికారులు.