36 గంటలు..70 అడుగులు..దొరకని పాప ఆచూకీ

రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన ఏడాది చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పాప బోరు బావిలో పడగా రాత్రి 8 గంటల నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. పాపను రక్షించడానికి రోబోటిక్ హ్యాండ్ క్లిప్, చైన్ పుల్లింగ్ టెక్నాలజీని ఉపయోగించినా ఫలితం లేకపోయింది. లోపల బోరును బయటకు తీస్తే దాని సహాయంతో చిన్నారి బయటపడవచ్చన్న ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నం విఫలమైంది..ముందుగా 37 అడుగుల లోతులో ఉన్న పాప మోటారును పైకి లాగిన తర్వాత 70 అడుగుల లోతులో కూరుకుపోయినట్లు గుర్తించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పాప క్షేమంగా తిరిగి రావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.