తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్....

 

అసలే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే ఇప్పుడు తాజాగా మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ విప్ పదవికి సంపత్ రాజీనామా చేశారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన సంపత్ పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంపత్ ను బుజ్జగించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే ఆయనను జానారెడ్డి నివాసానికి రమ్మని పిలిచినా.. ఆయన మాత్రం వారి మాట పట్టించుకోకుండా వెళ్లిపోయారు.