తెలంగాణాలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు?

 

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంకేతాలు ఇవ్వడంతో, తెలంగాణ కాంగ్రెస్ అలెర్ట్ అయింది.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం, బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ చూస్తుంది.. ఇదే ఫార్ములాని తెలంగాణ కాంగ్రెస్ ఫాలో అవ్వాలనుకుంటుంది.. తెరాస వ్యతిరేక పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తుంది.. తెలంగాణలో తెరాస కాకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌, టీఈపీ ఇలా చాలా పార్టీలు ఉన్నాయి.. ఎవరికి వారు ఒంటరిగా బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మళ్ళీ తెరాసనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.. అందుకే తెలంగాణ కాంగ్రెస్ తెరాస వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో తెరాసని ఓడించాలని చూస్తుంది.

టీడీపీ ఏపీ లో అధికారంలో ఉంది కానీ, తెలంగాణాలో ఆ పార్టీ పరిస్థితి బాలేదు.. టీడీపీ అగ్రనేతలు చాలావరకు పార్టీని వీడి. తెరాస, కాంగ్రెస్ లలో చేరారు.. అయితే టీడీపీకి హైదరాబాద్, ఖమ్మం, అలానే కొన్ని గ్రామాల్లో ఇంకా ఓటు బ్యాంకు ఉంది.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందట.. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసింది.. కానీ ఇప్పుడు టీడీపీ,బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.. ఇక తెరాసతో కూడా టీడీపీ కి సఖ్యత లేదు.. అందుకే కాంగ్రెస్ టీడీపీతో పొత్తుకు సిద్ధమని సంకేతాలు ఇస్తుంది.. అలానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసిన సీపీఐ ఈసారి కూడా కాంగ్రెస్ తోనే కలిసి నడవాలనుకుంటుంది.

ఇక తెలంగాణ ఇంటి పార్టీ (టీఈపీ) ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైంది.. అలానే తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కోదండరాం టీజేఎస్‌ కూడా కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధంగా ఉంది.. కాంగ్రెస్ కి బీజేపీ పూర్తి వ్యతిరేకం కావున ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.. అలానే సీపీఎం కూడా ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.. తెరాసను అడ్డుకోవాలంటే టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌, టీఈపీ ఇలాంటి పొత్తు తప్పనిసరి అని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోందట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో.