తెలంగాణ కాంగ్రెస్ 2019 ఎన్నికల మేనిఫెస్టో..!!

 

తెలంగాణలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది.. ఒకవైపు అధికార పార్టీ తెరాస ముందస్తుకు వెళ్లాలని సిద్ధమవుతుంటే, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ధీటుగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దమంటుంది.. తెరాస అసెంబ్లీ రద్దు, ముందస్తు ఆలోచనలో ఉండగానే.. కాంగ్రెస్ ఒకడుగు ముందుకేసి 2019 ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసే పనిలో పడింది.. తాజాగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించారు.. ఆరేడు నెలల నుంచి మేనిఫెస్టోకు కసరత్తు జరిగిందని ఆయన చెప్పారు.. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలలోని ప్రధానాంశాలు..

  • ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇల్లు
  • ఇళ్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలు.. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు లక్ష అదనం
  • కల్యాణ లక్ష్మీ సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
  • ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
  • అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు
  • ఇందిరమ్మ ఇళ్లలో రూ.2 లక్షలతో అదనంగా మరో గది
  • డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టుకుంటే రూ.5 లక్షలు
  • దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు
  • తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 7కిలోల సన్న బియ్యం