తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కరోనా సోకింది. అనారోగ్యానికి గురి కావడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం ఫామ్ హోజ్ లోనే కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ.. అవసరమైతే హాస్పిటల్ కు తరలిస్తామని వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ కు కరోనా సోకిందన్న వార్తలతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఇటీవల ఉప ఎన్నిక జరిగిన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. నియోజకవర్గంలో సోమవారం 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి ఈనెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేదికపై భగత్ తో మాస్క్ లేకుండానే మాట్లాడారు కేసీఆర్. హాలియా సభలో వేదికపై కూర్చున్న చాలా మంది నేతలకు కరోనా నిర్దారణ అయిందని తెలుస్తోంది.  టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. సభ తర్వాత చాలా మంది నేతలకు కేసీఆర్ తో కరచాలనం చేశారు.