ఇరు వర్గాల భేటీ తర్వాత ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రానుందా...

 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొలిక్కొస్తుందా. కార్మికులు ప్రభుత్వం మధ్య సయోధ్య  కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయా. ఇరువర్గాలూ మెట్టు దిగడానికి అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నాయి బస్ భవన్ వర్గాలు.ఇరువర్గాల మధ్య ఆర్టీసీ విలీనంపైనే పీటముడి నెలకొని ఉంది. విలీనానికి మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయితే మిగిలిన అంశాలకు అంగీకరిస్తే విలీనంపై కార్మిక సంఘాలు మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ నెల 28 నాటికి  సమస్య పరిష్కారం అవుతుందని హై కోర్టు ఆశాభావం వ్యక్తం చేసిన నేపధ్యంలో కమిటీ సంప్రదింపుల ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది.కోర్టు ఉత్తర్వులు అందితే చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.కార్మికుల డిమాండ్ లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీ ఏర్పాటు చేసింది హైకోర్టు సూచించిన ఇరవై ఒక్క అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.రెండురోజుల్లో ఎండీకి నివేదిక ఇవ్వనుంది నిన్న దీని పై ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ హై కోర్టు ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.తక్షణమే వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు.కార్మికులు మెట్టు దిగడానికి అవకాశం ఉందా విలీనం డిమాండ్ మినహాయిస్తే కార్మి కుల డిమాండ్ లో ప్రధానమైనవేంటి, కార్మికుల సమ్మె కు ఎలా ముగింపు పలకవచ్చని అంశాల పై ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది.మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె పంతొమ్మిదో రోజుకు చేరింది బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు మౌనదీక్ష చేపట్టారు.అఖిల పక్ష పార్టీ లు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నేతలు కార్మికులు సమ్మెకు మద్దతు పలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ కొద్ది సేపట్లోనే భేటీకానుంది బస్ భవన్ లో భేటీ అవుతుంది. కోర్టు సూచించినటువంటి కోర్టు డైరెక్ట్ చేసినటువంటి ఇరవై ఒక్క అంశాలు ముందుగా కార్మిక సంఘాలన్ని కలిసి టీఎంయూ ఆధ్వర్యంలో నలభై రెండు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి.