చర్చా ... రచ్చా ...

 

Telangana bill debate, Andhra Pradesh assembly, No debate on Telangana Bill, Samaikyandhra, Seemandhra

 

 

నూతన సంవత్సరారంభంలోనే సంక్లిష్టమైన సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుర్కోబోతోంది. తెలంగాణా ముసాతిడా బిల్లు రూపంలో రానున్న ఆ కీలక సందర్భానికి మా శాసనసభ్యులు సిద్ధమయ్యారా? మా తరపున పదునైన అస్త్రశస్త్రాలు సంధించనున్నారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం, పాలకవర్గాలు నిన్నం ఒన్నటి దాకా సీమాంధ్ర, తెలంగాణాల పేరిట సమాంతరంగా చీలిపోయి ఉన్నట్టు కనపడడంతో ఎవరి ధోరణి ఎలా వుంటుందనేది కనిసం ఊహకు అందేది, అయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం రెండు ముక్కలు కాకముందే ప్రజాప్రతినిథులు ఇరవై ముక్కలు ఇంకా ఎక్కువగానే అయిపోయినట్టు అనిపిస్తోంది.

 

ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిథుల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చాక జరిగేది ఏమిటనేది సరైన విధంగా అంచనా వేయడం రాజకీయ విశ్లేషకుల వల్ల కావడం లేదు. వ్యూహాత్మకంగా సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి చర్చలో కీలకం కానుంది. ఇప్పటికే సి.ఎం. వైఖరి పట్ల తెలంగాణ మంత్రుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా, సీమాంధ్ర మంత్రుల్లోనూ కొందరి నుండి అదే స్థాయి వ్యతిరేకత తప్పడం లేదు. నిన్నా మొన్నటిదాకా సిఎంకు అత్యంత అనుకూలంగా వ్యవహరించే కొండ్రు మురళి వంటి మంత్రులు సైతం విభజనకు పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతుండడం చూస్తుంటే ఎవరిది డ్రామానో, ఎవరిది నిజమో అర్థంకాని పరిస్థితి.


మరోవైపు చర్చలో పాల్గొన్నప్పుడు బిల్లులోని విభిన్న అంశాలపై ఆయా రంగాలకు చెందినా మంత్రులు మాట్లాడాల్సి ఉంటుంది. విద్యుత్, నదీజలాలు, శాంతిభద్రతలు, రాజధాని ... ఇలా ఒక్కో అంశంపై సంబంధిత శాఖ మంత్రి మాట్లాడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటిదాకా సీమాంధ్ర మంత్రులెవరూ ఆయా అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధం చేసుకుంటున్న దాఖలాలు లేవు, అన్నింటికీ ఆయాదే భారం అన్నట్టు ముఖ్యమంత్రిపై నెపం నెట్టేస్తున్నారు. గెలిచినా, ఓడినా .. సమైక్యాంద్ర కోసం పోరాడిన ఏకైన వీరుడి క్రెడిట్ కోసం నానా తంటాలు పడుతున్న ముఖ్యమంత్రికి ఇది కూడా ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ మంత్రులు పక్కాగా రెడీ అవుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ... మూడున అసెంబ్లీకి రానున్న తెలంగాణ బిల్లుపై చర్చ ... ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.