తాగుబోతు ఎమ్మెల్యేలకు చెక్..

 

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెల్ నేతలు చేసిన రభస మాయని మరకగా నిలిపోయింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన పనికి పార్టీ మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్న సమయంలో..అక్కడే ఉన్న కోమటిరెడ్డి హెడ్ సెట్ ను తీసి పోడియం వైపు విసిరాడు. అది కాస్త వెళ్లి కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌట్ కంటికి తగలి గాయమైంది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక కాంగ్రెస్ నేతలు చేసిన ఈ పనికి టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ పక్కనున్న సభాపతిని గాయపర్చడమంటే.. అది గవర్నర్ మీద దాడి జరిగినట్టే అని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే పెద్ద న్యూస్ అనుకుంటుంటే.. మరో ఆసక్తికరమైన విషయం ఒకటి తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలోకి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాగి తూలుతూ వస్తున్నారని, ఒక ఎమ్మెల్యే ఏకంగా సీఎల్పీ లీడర్ జానారెడ్డి మీద పడిపోయారని చెప్పుకొచ్చారు తెరాస లెజిస్లేటివ్ కౌన్సిల్ విప్ పల్లా రాజేశ్వర్. గవర్నర్ ప్రసంగ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘ఆన్’లో వున్నారన్న పల్లా వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారాన్ని రేపాయి. పల్లా వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి”దమ్ముంటే నేను తాగి సభకొచ్చానని ప్రూవ్ చేయండి.. నేను కాదు మీరూ, మీ సీఎం పక్కా తాగుబోతులు… ప్రగతిభవన్లో ప్రతిరోజూ మద్యం ఏరులై పారుతున్న విషయం ఎవరికీ తెలీదనుకుంటున్నారా?’ అంటూ కోమటిరెడ్డి రంకెలేశారు. దీంతో ఒకరి మీద తాగుబోతులంటూ విమర్శలు గుప్పించుకుంటున్న నేపథ్యంలో అసెంబ్లీలో మరో కొత్త రూల్ వచ్చేలా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకలు. అదేంటంటే... బ్రెత్ ఎనలైజింగ్. సభకొచ్చే ప్రతీ సభ్యుడు.. బ్రెత్ ఎనలైజర్ తో ఊదించుకుని వచ్చేలా కొత్త నిబంధన అమల్లోకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆఖరికి అసెంబ్లీల్లో కూడా బ్రెత్ ఎనలైజింగ్ అంటే ఎంతు దుస్థితి ఏర్పడిందో అర్ధంచేసుకోవచ్చు..