అఖిల పక్ష సమావేశానికి ప్రతినిధుల ఖరారు

 

 

 

ఈ నెల 28 న తెలంగాణా ఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి వెళ్ళే నేతల జాబితాను టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బిజెపి లు ప్రకటించాయి.

 

తెలంగాణా రాష్ట్ర సమితి నుండి ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్ర శేఖర రావు, నాయని నరసింహా రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ పార్టీ నుండి మైసూరా రెడ్డి, మహేందర్ రెడ్డి లు హాజరవనున్నారు. భారతీయ జనతా పార్టీ నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కంబంపాటి హరిబాబు లు ఈ సమావేశానికి హాజరవుతారు.

 

ఎంఐఎం నుండి ఒవైసీ సోదరులు హాజరవుతారు. సిపిఎం నుండి రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎంఎల్ఏ జూలకంటి రంగా రెడ్డి లు ఆ పార్టీ ప్రతినిధులుగా హాజరవుతారు. ఇక సిపిఐ తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, ఎంఎల్ఏ గుండా మల్లేష్ లు హాజరవుతారు.

 

ఈ సమావేశంలో బిజెపి, సిపిఐ పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి. ఇక సిపిఎం, ఎంఐఎంలు మాత్రం తెలంగాణా వ్యతిరేక వైఖరి అవలంభించనున్నాయి.