ఇవాంక వెళ్లింది.. బెగ్గర్స్ వచ్చారు...

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కూతురు హైదరాబాద్ రావడం ఏమో కానీ.... నగరాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అందంగా ముస్తాబు చేసింది. ఆమె వచ్చే రూట్ ను లైటింగ్ లతో అలంకరించారు. రంగులు వేశారు. ఇంకా నగరం మొత్తం బెగ్గర్స్ ఫ్రీ చేశారు. ఇక ఇవాంక వచ్చింది.. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొంది.. వెళ్లిపోయింది. ఇక ఆమె వెళ్లిపోవడంతో మళ్లీ మాములైపోయింది. మళ్లీ రోడ్లపై బిచ్చగాళ్లు దర్శమిస్తున్నారు. ఇవాంక వస్తున్న నేపథ్యంలో.. బిచ్చగాళ్లందరినీ..  అరెస్ట్ చేసి జైళ్లకు తరలించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు  వందలాది మంది బిచ్చగాళ్లను బయటకు వదిలేస్తున్నారు. దీంతో నగర కూడళ్లలో తిరిగి వారి సందడి మొదలైంది. వాళ్లకు పునరావాసం కల్పిస్తామన్న మాటను అధికారులు నిలబెట్టుకోలేకపోయారు. చర్లపల్లి జులై నుంచి, చంచల్ గూడ జైలు నుంచి యాచకులను వదిలేశామని జైలు అధికారులు వెల్లడించారు. వారు మళ్లీ యాచక వృత్తిలోకి అడుగు పెట్టకుండా, పెట్రోలు బంక్ లు, స్టోర్లలో ఉద్యోగాల చేసే అవకాశాలు అందిస్తామని చర్లపల్లి ఒపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ అర్జునరావు వెల్లడించారు. కానీ ఇప్పుడు వారిని బయటకు వదిలేస్తున్నారు. మొత్తానికి మళ్లీ నగరం శుభ్రంగా ఉండాలంటే.. విదేశాల నుండి ఇంకెవరైనా వీవీవీఐపీలు రావాలేమో...