టీనేజర్స్ గదులు ఎలా ఉండాలంటే...?

 

టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందువల్ల వారి అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా గది ఏ రంగులో ఉంటే ఇష్టమో ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి.

 

రంగులను క్రియేటివ్‌గా వేస్తే బావుంటుంది. బాక్‌గ్రౌండ్ అంతా ఒకే కలర్‌లో ఉండనవసరం లేదు. గ్రే, గ్రీన్, బ్లూ కలర్స్‌లో బాగా లైట్‌గా ఉండే షేడ్‌ని ఎంచుకుంటే బాగుంటుంది. ఆ రంగుల వల్ల గోడలు ప్లెజంట్‌గా అనిపిస్తాయి. అవి వారి మనస్తత్వానికి అనువుగా ఉండటం వల్ల వారు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతే కాకుండా వారు కూడా కొత్తగా ఫీల్ అవుతారు.

 

 

టీనేజర్స్ గదిలో ఉండే మంచం కొద్దిగా పెద్దదిగా ఉండాలి. అలాగే ఆ గదిలో వార్డ్‌రోబ్స్ ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఒక వార్డ్‌రోబ్‌కి అద్దం బిగించితే మంచిది. తెలుపు, మెరైన్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, గ్రే రంగులైతే ఫర్నిచర్‌కి కూడా సూట్ అవుతాయి. షెల్వ్స్‌కి ఉండే స్టాండ్‌లు లేతరంగులలో, మంచి ఆకృతిలో ఉంటే, పుస్తకాలు ఉంచడానికి అనువుగా ఉంటాయి. అలాగే చదువుకి సంబంధించినవాటిని ఉంచుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. కంప్యూటర్ తప్పనిసరి కనుక, అనువుగా ఉండేలా అమర్చుకోవాలి.

 

రూం లో కర్టేన్స్, వాల్ పోస్టర్స్, డిజైన్స్ వంటివి ఏమైనా కూడా వారికి నచ్చే విధంగా డెకరేట్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా చేయటం వల్ల టీనేజర్స్ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. వారి మనస్తత్వం కూడా సరిగా ఉంటూ, ఎప్పుడూ చలాకీగా ఉంటారు.