టీడీపీ దూకుడు... ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు!!

రూల్ 71 నోటీసు పై జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన టిడిపి ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాద్ రెడ్డిలపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకూ టిడిఎల్పీ సిద్ధమైంది. విప్ దిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని టీడీఎల్పీ కోరనున్నట్లు సమాచారం. నిన్న రూల్ 71 చర్చలో భాగంగా చేపట్టన డివిజన్ తరువాత జరిగినటువంటి ఓటింగ్ లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ఆ ఇద్దరు సభ్యుల పై కూడా చర్యలు తీసుకోవాలని నిన్ననే తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. వాళ్ళ పై చర్యలు తీసుకుకోవాలని ఒక లేఖను కూడా మండలి ఛైర్మన్ కి అపీల్ చేశారు.

మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ వెంటనే చర్యలకు దిగింది. ఇద్దరి ఎమ్మెల్సీల పై వేటు వేయాలని వాళ్ళని అనర్హులుగా గుర్తించాలని మండలి ఛైర్మన్ కి ఇప్పటికే అపీల్ చేశారు. తద్వారా ఈ రోజు బిల్స్ పై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఓటింగ్ ప్రక్రియలో ఇతర ఎమ్మెల్సీలు ఎవరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీ విధానానికి విప్ కి భిన్నంగా వ్యవహరించకూడదన్న ఆలోచనలో భాగంగానే వెంటనే చర్యలకు దిగినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ విధానానికి భిన్నంగా వ్యవహరించకూడదన్న ఆలోచనలో భాగంగానే విస్తృతంగా చర్యలకు దిగినట్లుగా సమాచారం.