టీడీపీ తొలి జాబితా..కూకట్ పల్లి అభ్యర్థి ఎవరు?
posted on Nov 13, 2018 8:54AM
తెలుగుదేశం పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. ఒక సీటుకు ఒకే పేరు పరిశీలనలో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించడంతో తొమ్మిది మంది పేర్లను ప్రకటించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. 14 స్థానాలకు తెదేపా పోటీ చేస్తుందని భావిస్తుండగా వివాదం లేని 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.కూకట్‌పల్లి నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ఈ జాబితాలో లేకపోవటం చర్చనీయాంశమైంది. మరో 5 నియోజకవర్గాల అభ్యర్థులను నేడో, రేపో ఖరారు చేయనున్నారు.
నియాజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా:
ఖమ్మం - నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య
అశ్వారావుపేట - మచ్చా నాగేశ్వరరావు
వరంగల్ పశ్చిమ - రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మక్తల్ - దయాకరరెడ్డి
మహబూబ్‌నగర్ - ఎర్రశేఖర్
ఉప్పల్ - వీరేందర్‌గౌడ్
శేరిలింగంపల్లి - భవ్య ఆనంద ప్రసాద్
మలక్ పేట - ముజఫర్ అలీ