జగన్ చేసిన బిగ్ మిస్టేక్..?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.. టీడీపీ, వైసీపీ అధికారం మాది అంటే మాది అంటూ పోటీపడుతున్నాయి.. మరో వైపు జనసేన కూడా అధికారం మాదే అంటుంది.. అయితే ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి టీడీపీకే ఎక్కువ ఆస్కారం ఉందని విశ్లేషకులు భావిస్తోన్నారు.. మరోవైపు సర్వేలు కూడా టీడీపీకే అనుకూలంగా వస్తున్నాయి.. అయితే ఈ అనుకూల వాతావరణానికి, చంద్రబాబు నిర్ణయాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తుంది అంటూ బాబు ఎన్డీయే నుండి బయటికి రావడం.. ప్రత్యేకహోదా మరియు విభజన హామీలు నెరవేర్చాలంటూ పట్టుబట్టి కేంద్రం మీద పోరాడటం, ఇప్పుడు ఏకంగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టి బీజేపీ మీద పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకోవడం.. ఇవన్నీ బాబుకు బోలెడంత మైలేజీ తీసుకొచ్చాయని అంటున్నారు.

 

 

అయితే ప్రతిపక్ష నేత జగన్ పరిస్థితి వేరేలా ఉంది.. ఎవరి తీసుకున్న గోతిలో వారే పడినట్టుగా.. తన తీసుకున్న నిర్ణయం తనకే తలనొప్పిగా మారింది.. ఈ నాలుగేళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యేకహోదా అన్న జగన్, తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు.. ఇప్పుడు పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.. దీని వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.. మరోవైపు ఎంపీల రాజీనామా నిర్ణయం కూడా తప్పని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఎంపీలు రాజీనామా చేయకుండా ఉంటే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉండేది.. అలానే అవిశ్వాసానికి కూడా మద్దతిచ్చే అవకాశం ఉండేది.. కాని ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.. దీంతో జగన్ నిర్ణయం పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఒకవైపు టీడీపీ, బీజేపీ మీద అవిశ్వాసం అంటూ ప్రజలకు దగ్గరవుతుంటే.. వైసీపీ మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.