కొనసాగుతోన్న మండలి ఉత్కంఠ... టీడీపీ నెక్ట్స్ స్టెప్ అదేనా?

మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందినా, మండలిలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మండలిలో మూడు రాజధానుల బిల్లును టీడీపీ వ్యూహాత్మకంగా అడ్డుకోవడంతో తర్వాత జరుగుతోందన్న టెన్షన్ అధికార పార్టీని వెంటాడుతోంది. మండలిలో ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడంలో విజయవంతమైన తెలుగుదేశం... మళ్లీ మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే... వాటిని సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ పట్టుబడుతోంది. ఆ మేరకు ఇఫ్పటికే నోటీసులు కూడా ఇఛ్చారు. 

అయితే, తాము మంగళవారం సాయంత్రమే మండలిలో బిల్లులను ప్రవేశపెట్టామని మంత్రి బొత్స చెబుతున్నారు. మంగళవారమే మండలిలిలో బిల్లులను ప్రవేశపెట్టేశామని ప్రభుత్వం చెబుతుండటంతో... టీడీపీ కూడా తెలివిగా కౌంటరిస్తోంది. తాము కూడా మంగళవారం ఉదయమే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. ఏదిఏమైనాసరే, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం మినహా మరో గత్యంతరం లేదని టీడీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు. మొత్తానికి, మూడు రాజధానుల బల్లుపై మండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరి, రూల్ 71ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చి మండలిలో ప్రభుత్వానికి షాకిచ్చిన టీడీపీ... నెక్ట్స్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి.