అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

టీడీపీ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇటీవల ఈఎస్‌ఐ స్కాం ఆరోపణలుతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్‌ కు ఒక్కరోజు ముందు ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. 

మరోవైపు, అచ్చెన్నాయుడును ఆసుపత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అచ్చెన్నాయుడుకు రెండోసారి ఆపరేషన్ జరిగిందని, ఆపరేషన్ తర్వాత ఆయన పరిస్థితి ఇబ్బందిగా మారిందని లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ లాయర్‌.. అచ్చెన్నాయుడుకు పూర్తిస్థాయిలో చికిత్స అందించామని, ఆయనకు మెరుగైన వైద్యం అవసరం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న  హైకోర్టు.. ఈ అంశంపై శనివారం తీర్పు ఇస్తామని తెలిపింది.