డిల్లీ అయిపోయింది... ఇప్పుడు గల్లీకి చేరింది...

 

టీడీపీ -బీజేపీ మధ్య గతకొద్దికాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ మిత్రపక్షం కాబట్టి.. చంద్రబాబుకు ఉన్నసంహనంతో ఒకపక్క బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నా ఇన్నిరోజులు బీజేపీతో కలిసుంది. ఇక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో ఏపీకి మొండిచేయి చూపడంతో  ఈ వివాదం కాస్త ముదిరి పాకాన పడింది. దీంతో రెండు పార్టీలు తెగదెంపులు ఖాయమని తెలుస్తోంది. దీంతో రెండు పార్టీలు బహిరంగంగానే గొడవలకు దిగుతున్నాయి.

 

ఇప్పటికే విభజన హామీల మీద పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు చేశారు పోరాటం ఉదృతం చేశారు. బీజేపీ ఏపీకి చేసిన న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక దీంతో బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద కౌంటర్ అటాక్ చేశారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సైతం టీడీపీ అవినీతి మీద పోరాటం చేస్తాం అనే ప్రకటన చేశారు. దీనికి టీడీపీ నేతలు కూడా ఎక్కడా తగ్గకుండా బీజేపీకి గట్టిగా సమాధానం చెబుతుంది. దీనికి తోడు ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం , అందలూరులో బీజేపీ, టీడీపీ మధ్య గొడవ చోటుచేసుకుంది. అందలూరులో బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు వున్న విషయం తెలుసుకున్న టీడీపీ స్థానిక నాయకులు , కార్యకర్తలు ఆయన దగ్గరకు వెళ్లారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులపై గోకరాజు రంగరాజు విసుక్కున్నారు. ఇక టీడీపీ నాయకులు కూడా అసహనానికి గురి కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఈ వ్యవహారం సాగుతున్నప్పుడు భీమవరం టీడీపీ ఎమ్మెల్యే అంజిబాబు అక్కడే ఉన్నప్పటికీ మౌనంగా ఉండిపోయారు. మరి నిన్నటివరకూ ఢిల్లీకే పరిమితమైన ఈ గొడవ.. ఇప్పుడు గల్లికి చేరింది. మరి చూడబోతే త్వరలోనే రెండు పార్టీలు విడాకులు తీసుకునే రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తోంది.