తగ్గిన ప్రజల మూలధన వ్యయం..  ఏపీకి తీవ్ర నష్టం!!

ఈ ఏడాది పన్ను విషయంలో ఏపీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందనిసమాచారం. ఏపీలో ప్రజల మూలధన వ్యయం తగ్గింది. గత ఏడాదితో పోల్చితే 69% శాతం పతనమైనట్టు ఓ ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదిక తెలిపింది. వాహనాల కొనుగోళ్లలో 31% తిరోగమనం ఉంటుంది. పీక్ టైమ్ లో విద్యుత డిమాండ్ తగ్గిపోయింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే తీవ్రంగా తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని అంచనా వేసేందుకు పరిగణలోకి తీసుకునే పలు అంశాల ఆధారంగా జాతీయ స్థాయిలో ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన నివేదిక ఈ విషయం వెల్లడించింది. పలు అంశాల్లో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితి ఎలా ఉందో లెక్కలు తీసి అంతకుముందు ఏడాదితో పోల్చితే ప్రతి రాష్టానికి  ఆయా సూచికల్లో వచ్చిన మార్పులను కలిపి మొత్తం స్కోరును ఇచ్చింది. 

ఆర్ధిక అభివృద్ధి ఎలా ఉందో చెప్పడంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అదే సమయంలో ప్రజలు చేసే మూలధన వ్యయం అనేవి కీలక అంశాలు. ప్రభుత్వానికి పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల ఫీజులు, జీఎస్టీ, యాక్సిస్ తదితర పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 7% శాతం తగ్గిందని పేర్కొంది. ఈ ధోరణి నెలకొన్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొంది. ఈ సమయంలోనే ప్రజల మూలధన వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. మూలధన వేయమంటే భూములు, స్థలాలు, ఇళ్లు ఇతర స్థిరాస్తుల పై వెచ్చించే మొత్తం. ఈ వ్యయం ఎంత ఎక్కువుంటే అంతగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. ఈ వ్యయం పైనే ఆర్థిక చక్రం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ప్లాటు కొనుగోలు చేశాడని అనుకుంటే అంత మేరకు సిమెంట్ ఇనుము ఇసుక కంకర అన్ని వ్యాపారాలు చేసే వారికి బాసటగా నిలిచినట్లే.