ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు..

 

తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా అక్కడ విశాల్ ఎపిసోడ్ నడుస్తోంది. ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో విశాల్ సడెన్ గా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆర్కే నగర్ ఉపఎన్నికలో నామినేషన్ వేసి అందరికీ షాకిచ్చాడు. అయితే విశాల్ నామినేషన్ ను తిరస్కరించి.. ఈసీ విశాల్ కు షాకిచ్చింది. నామినేషన్ పత్రాల మీద సంతకం చేసిన ఇద్దరు అది తమ సంతకం కాదని రిటర్నింగ్ అధికారి ముందు చెప్పడంతో విశాల్ నామినేషన్ ను తిరస్కరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విశాల్..  ఓ అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేయకూడదా?  ప్రధాన పార్టీలకు తాను సవాల్ గా మారుతానని, తన సత్తా చూపించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఓ యువకుడిని గెలిపిస్తానని సవాలే చేశాడు. ఇప్పుడు తాజాగా మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్  అధికారిపై వేటు పడింది. విశాల్ నామినేషన్ వ్యవహారంలో  వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది. విశాల్‌ నామినేషన్‌ ఉదంతంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.